Home  »  TV News  »  Brahmamudi :నందు పోలీస్ ట్రైనింగ్... వెంకీ మౌన ప్రేమ.. !

Updated : Aug 27, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి Brahmamudi. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 1121 లో....పోలీస్ ట్రైనింగ్‌కి వెళ్తున్నానని చెప్పి వెంకీని ఆఖరిసారి కలవడానికి నందు వస్తుంది. మళ్లీ ఎప్పుడు వస్తానో తెలియదంటూ ఎమోషనల్ అవుతుంది. ట్రైనింగ్ ఎక్కడ అని చలపతి అడగ్గా పది నెలలు ఉంటుందని, పోస్టింగ్ ఎక్కడో తెలియదు అది మన చేతుల్లో ఉండదని చెప్తుంది. మాకు కనిపించనంత దూరం వెళ్లిపోతావా అని చలపతి అనగా, దగ్గరగా ఉండాలనుకున్నా ఉండలేం కదా అంకుల్ అంటూ బాధను దాచుకుని పైకి నవ్వుతూ కనిపిస్తుంది. పోలీస్ కి సెలెక్ట్ అయిన సంతోషం నీ మొహంలో లేదని చలపతి అంటే ఇష్టమైన వాళ్లకు దూరంగా వెళ్తున్నా కదా అని తన బాధను వ్యక్తం చేస్తుంది నందు.

 

వెళ్లే ముందు వెంకీ వైపు తిరిగి నాకు ఏదైనా చెప్పేది ఉందా అని నందు ఆశగా అడుగుతుంది కానీ వెంకీ ఏమీ లేదని మౌనంగా ఉంటాడు. బాగా ఆలోచించుకో.. తర్వాతైనా ఫోన్ చేసి చెప్పమని చెప్పి నందు వెనుతిరుగుతుంది. వాడు చెప్పేది ఉంటే నీకే చెబుతాడు కదమ్మా అని చలపతి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తాడు. నందు వెళ్లిపోయాక బాధపడుతున్న వెంకీ దగ్గరకు లక్ష్మీ వచ్చి ఓదారుస్తుంది. ఆ అమ్మాయికి నీ ప్రేమ విషయం చెప్పాల్సింది కదరా అంటుంది. ఆ అమ్మాయి ఇక నన్ను మర్చిపోతుంది.. నేను సంతోషంగా లేకపోయినా నాన్న సంతోషంగా ఉంటాడు కదా అని తన ప్రేమను త్యాగం చేస్తున్నట్లుగా వెంకీ కుమిలిపోతాడు.మరోవైపు రూంలో ఐశ్వర్య IAS ప్రిపరేషన్ పేరుతో పుస్తకాలతో కుస్తీ పడుతూ బిల్డప్ ఇస్తుంది. స్వాతి నిజంగానే చదువుకుంటుంటే, ఐశ్వర్య మాత్రం అన్ని పుస్తకాలు బెడ్ మీద వేసుకుని ఇది అయిపోయింది.. అది అయిపోయిందంటూ నటిస్తుంది. నువ్వు నటిస్తున్నావ్..  వాళ్లు నిజంగా చదువుతారని స్వాతి కౌంటర్ వేస్తుంది. తను కంటిన్యూగా చదవగలనని చెప్పిన ఐశ్వర్య కాసేపటికే బోర్ కొడుతోందని.. ఐదు నిమిషాలు ఫోన్ చూసి రిలాక్స్ అయి మళ్లీ చదువుతానని అంటుంది. టైమ్ వేస్ట్ అవుతుందని స్వాతి హెచ్చరించినా వినకుండా రీల్స్ చూస్తూ గంట సమయం వృథా చేస్తుంది. ఆ తర్వాత నడుం నొప్పి అంటూ పడుకుని, పార్టీలకు రాత్రంతా మేలుకోగలను కానీ చదువుకునేటప్పుడు నిద్ర వస్తోందనుకుంటూ నిద్రపోతుంది.

 

ఉదయాన్నే ఐశ్వర్య బాగా చదివిందని భావించి ఇందు కాఫీ తీసుకువస్తుంది. కానీ రాత్రంతా ఫోన్ చూస్తూ ఏం చదవలేదని స్వాతి చెప్పడంతో ఇందుకు కోపం వస్తుంది. నిద్ర లేపి కాఫీ కష్టపడి చదివిన వాళ్లకే ఇస్తానని స్వాతికి ఇస్తుంది. వద్దులే అక్కా ఐశ్వర్యక్క ఫీల్ అవుతుందని స్వాతి అన్నా.. అది అరవడం తప్ప ఏం చేయదని ఇందు అంటుంది. చదవడం నీ వల్ల కాదు.. కంపెనీ వ్యవహారాలు చూసుకోవడం కాదు.. ఇంటి పని, వంట పని నేర్చుకో అదైనా పనికి వస్తుందని ఐశ్వర్యకి ఇందు సలహా ఇస్తుంది. నువ్వు ఎలాగూ పాస్ కావు కదక్కా ఇవైనా నేర్చుకోమని స్వాతి కూడా అనడంతో ఐశ్వర్య కోపంతో ఫైర్ అవుతుంది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.